calender_icon.png 6 September, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేకే 5 ఉపరితల గని ఉద్యోగులను అభినందించిన జీఎం

06-09-2025 06:57:50 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శనివారం జి.యం వి.కృష్ణయ్య జవహర్ ఖని 5 ఓపెన్ కాస్ట్ కు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చినందుకు ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణమోహన్ ని ,జే.కే 5 ఓ.సి ఉద్యోగులను అభినందించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బొగ్గు ఉత్పత్తి కంపెనీలలో గల ప్రమాదరహిత గనులకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ప్రతి ఏడాది అందజేస్తున్న ఫైవ్ స్టార్ అత్యుత్తమ గనుల అవార్డుకు ఈసారి సింగరేణి  ఇల్లందు ఏరియాలోని జవహర్ ఖని 5 ఓపెన్ కాస్ట్ గని ఈ  అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే నూతన జేకే ఉపరితల గని కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా గనికి కేటాయించిన ఉత్పత్తితోపాటు రక్షణ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఇతర గనులకు  ఆదర్శంగా నిలుస్తు ఉత్పత్తి, ఉత్పాదకత పెంచుతూ సింగరేణికి మరింత మంచి పేరు తీసుకురావాలని అన్నారు.