06-09-2025 05:41:27 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో ప్రకటించనున్న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జిఎస్టి) రేట్ల తగ్గింపులు దేశ ఆర్థిక విధానానికి, వినియోగదారుల ఖర్చులలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు. శనివారం రోజున కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రజలందరూ ఉపయోగించుకునే 80 శాతం వస్తువులపై టాక్స్ తగ్గింపు ఇదే మొదటిసారి అని తెలిపారు.
ముఖ్యంగా గతంలో ఉన్న నాలుగు పన్ను శ్లాబులను రద్దు చేసి, ఒక సరళమైన మూడుఅంచెల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని, నిత్యావసర వస్తువులకు 5 శాతం, సాధారణ వస్తువులకు 18 శాతం, విలాసవంతమైన, హానికరమైన వస్తువులకు 40 శాతం తో జిఎస్టి వర్తించేలా మార్పులు చేపట్టి, ప్రజలకు, వినియోగదారులకు మేలు జరిగేలా మోడీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం వల్ల భారతీయ ప్రజలందరికీ ,వినియోగదారులకు, వ్యాపారాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చనుందన్నారు.