calender_icon.png 11 October, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ రామలింగేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి విరాళం అందజేసిన ‘అల్ఫోర్స్’నరేందర్ రెడ్డి

11-10-2025 12:26:01 AM

కొత్తపల్లి, అక్టోబరు 10 (విజయ క్రాంతి): గంగాధర మండలంలోని వెంకంపల్లి లో గల శ్రీ రామలింగేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా క్టర్ వి నరేందర్ రెడ్డి శుక్రవారం 1,16,000 రూపాయల విరాళం అందజేశారు.

ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయాలను సంరక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని, ముఖ్యంగా ప్రాచీనమైన ఆలయాలు చాలా శక్తివంతమైనవని, వాటి పరిరక్షణకై ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సంద వేణి వెంకట్, సహస్ర జూనియర్ కళాశాలల అధినేత, ఆలయ కమిటీ చైర్మన్ సంకటి శ్రావణ్, పల్మరి సతీష్ యాదవ్, పల్మరి సంపత్ యాదవ్, తదితరులుపాల్గొన్నారు.