calender_icon.png 11 October, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: ఎస్సై మహేష్

11-10-2025 12:25:04 AM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని అంతర్గాం తండాలో  పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంతో ఎస్సై మహేష్ సిబ్బందితో కలిసి శుక్రవారం వేకువ జామున రాత్రి ఒంటి గంటకు దాడి చేసి నలుగురు వ్యక్తులను, పేక ముక్కలు, రూ.3250/ (మూడు వేల రెండు వందల యాభై) స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్సై మహేష్ మాట్లాడుతూ... అంతర్గాం తండాలో మూడు ముక్కల పేకాట (3 కార్డ్స్) ఆడుతున్నారానే కచ్చితమైన సమాచారం  రావడంతో మెరుపు దాడి నిర్వహించమని అన్నారు. పేకాట స్థావారంలో 3250/- రూ, 52 ప్లేయింగ్ కార్డ్స్, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేసి కేసు నెమోదు చెయ్యడం జరిగిందన్నారు. ప్రజలు ఎవరు కూడా పేకాట ఆడి జైలు పాలు అయ్యి జీవితాలు నాశనం చేసుకోవద్దని, జైలుపాలు కావొద్దని మీ కుటుంబాలను వీధి పాలు చేసుకోవద్దని ఎస్సై మహేష్ హెచ్చరించారు. ఎస్సై తో పాటు పోలీస్ సిబ్బంది సీతారాం, విష్ణు వర్ధన్ రెడ్డి, ఫర్హన్ పాల్గొన్నారు