calender_icon.png 7 November, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోజుకి రూ. 5.47 కడితే...

07-11-2025 05:12:22 PM

- రూ. 40 లక్షల ప్రమాద భీమ

- టీజీబీ సీతారాంపల్లి మేనేజర్

నస్పూర్,(విజయక్రాంతి): ఒక రోజుకి రూ. 5.47 కట్టడం వల్ల రూ. 40 లక్షల ప్రమాద భీమా పొందవచ్చునని తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీతారాంపల్లి బ్రాంచి మేనేజర్ గోసిక స్వామి వెల్లడించారు. శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ తో ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం జరిగి అవయవాలు కోల్పోయినా, పాక్షికంగా అంగవైకల్యం జరిగినా ఈ బీమా వర్తిస్తుందన్నారు. అంతే కాకుండా ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయంలో అంబులెన్స్ చార్జీలు, కుటుంబంలోని ఇద్దరు చిన్న పిల్లలకు విద్యాసాహాయము కోసం కొంత మొత్తం ఇవ్వడం జరుగుతుందన్నారు.

ప్రమాద కారణం వల్ల జరిగే ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులకు సహాయార్థం కొంత మొత్తం అంత్యక్రియలకు డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏదైనా బ్యాంకు లోన్ ద్వారా ఆస్తి జప్తు కాకుండా కూడా ఈ పాలసీ మిమ్మల్ని కాపాడుతుందన్నారు. ఇది డిజిటల్ పాలసీ, క్లైమ్ సెటిల్మెంట్ సహాయానికి ఇన్సూరెన్స్ అధికారి మీ బ్యాంకులోనే ఉంటాడన్నారు. ప్రతి ఖాతాదారుడు పూర్తి ప్రమాద బీమా రక్షణతో ఆరోగ్య బీమా, వాహన బీమా, వంటి ఎన్నో పథకాలు మీ కుటుంబాన్ని ఆర్థిక రక్షణలో ఉంచుతుందన్నారు.