07-11-2025 05:19:29 PM
నిర్మల్,(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ జనరల్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి దివ్య 9వ తరగతి విద్యార్థి శ్రీవిద్య కృత్తిజ్ఞ ఆన్లైన్ పరీక్షల్లో ప్రతిభ సాధించినట్లు ప్రిన్సిపల్ డానియల్ తెలిపారు. వీరికి గైడ్ టీచరుగా కల్పన వివరించినట్టు తెలిపారు. రూ.36వేల నగదు ప్రోత్సహి ప్రశంస పత్రం అందుకున్నారు ప్రతిభ సాధించిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు అధ్యాపకులు శుక్రవారం అభినందించారు