calender_icon.png 7 November, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి

07-11-2025 05:14:50 PM

 బీసీ జాక్ చైర్మన్ తిరునహరి శేషు

హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు అభిప్రాయపడ్డారు. సుబేదారి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డాక్టర్ శేషు మాట్లాడుతూ... రిజర్వేషన్ల విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని,అక్టోబర్ 27 న బీసీ శాఖ ఆధ్వర్యంలో వ్రాసిన లేఖకి ప్రధానమంత్రి కార్యాలయం స్పందించిందని, దానికి బీసీ జాక్ రాష్ట్ర కమిటీ తరఫున స్వాగతిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో అవసరమైన తగు చర్యలు చేపట్టడానికి తెలంగాణ జాక్ రాసిన లేఖని బలహీన వర్గాల సంక్షేమ శాఖకు పంపుతున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం చొరవను స్వాగతిస్తున్నామన్నారు భారత ప్రభుత్వం జోక్యంతోనే మహిళా రిజర్వేషన్ల బిల్లుకి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకి, ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ల బిల్లుకి పరిష్కారం దొరికింది కాబట్టి బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా భారత ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయడం ద్వారానే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని, రిజర్వేషన్ల సాధనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా బలమైన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని అన్నారు.