calender_icon.png 24 January, 2026 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహాన్ని నింపిన అల్ఫోర్స్ "తరంగ్" వార్షికోత్సవ వేడుకలు

24-01-2026 09:36:45 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): నగరంలోని రేకుర్తిలో నిర్వహించిన ఆల్ఫోర్స్ గర్ల్స్ ఈ టెక్నో పాఠశాల "తరంగ్" వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహాన్ని నింపాయి.  ముఖ్య అతిథిగా అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ డి.సాధన హాజరై అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డితో  కలిసి వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలని, సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా ప్రోత్సాహం అందించాలన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.