24-01-2026 09:34:45 PM
ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నిర్మల్,(విజయక్రాంతి): పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చిన వారిని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడుపై ఉందని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు డిసిసి అధ్యక్షులు వెడుమ బొజ్జు పటేల్ తో కలిసి నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు పని చేయాలన్నారు. సర్వేల ఆధారంగా అధిష్టానం టికెట్లు కేటాయిస్తుందన్నారు. ఎవరికి టికెట్ కేటాయించిన కలిసి కట్టుగా పని చేసి అభ్యర్థుల గెలుపుకై కృషి చేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రజల కోసం పనిచేసే ప్రతి నాయకుడికి రాజకీయ అవకాశము కల్పిస్తామని డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ భరోసా ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను,అభివృద్ధిని ప్రజల్లో వివరించి ఓట్లు అడగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు, మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీహరి, లైబ్రరీ చైర్మన్ అంజుమన్ అలీ,రావు,నియోజకవర్గ ఇంచార్జీ బోస్లే నారాయణ రావు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, టీపీసీసి జనరల్ సెక్రెటరీ ఎంబడి రాజేశ్వర్, జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమరసింహారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.