calender_icon.png 16 October, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం సాధించుకోవాలి: తీన్మార్ మల్లన్న

16-10-2025 08:17:32 AM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఓం కన్వెన్షన్ హాల్లో బీసీ జేఏసీ సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీ కార్యకర్తల ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ ,తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) హాజరై మాట్లాడుతూ బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం కొరకు కృషి చేయాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి బీసీల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. బీసీలను ఓటు బ్యాంకు గానే వాడుకునేందుకు చూస్తున్నారు తప్ప చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యంలో మొండి చేయి చూపిస్తున్నారన్నారు. ఇంటలెక్షన్ ఫోరంలో వక్తల ప్రశ్నలకు తీన్మార్ మల్లన్న సమాధానాలు ఇచ్చారు.

విద్యా, వైద్యం ,వలసలు,ఉపాధి,జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లకు, కార్పొరేటేడ్ విద్య, వైద్యం,కల్తీ ఆహారం, మహిళా సంరక్షణ, నిరుద్యోగ యువత,బీసీ వాదం,సామాజిక న్యాయం,స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు,రిజర్వేషన్లు,బీసీల అస్తిత్వం,కుల గణన,పరిపాలన,సంచార జాతులు, ఆటో డ్రైవర్ల సమస్యలు,వివక్ష ,ఉద్యోగ,సామాజిక,ఆర్థిక,కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు,మేలుకొని కులగణ చేయాలి.తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తె ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తమన్నారు.ఈ కార్యక్రమములో టిఆర్పి వర్కింగ్ ప్రెసిడెంట్ హరి శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  జానయ్య యాదవ్,సూర్యారావు, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్,బెక్కం జనార్ధన్, సారంగి లక్ష్మీకాంత్, బుగ్గన్న, కోరమోని వెంకటయ్య, శ్రీనివాస్ ,విశ్రాంత డిఇఓ విజయ్ కుమార్, విశ్రాంత అటవీధికారి వెంకటయ్య, న్యాయవాది నిర్మల, కార్మిక, కర్షక, వివిధ కుల సంఘాల నాయకులు విద్యార్థి,యువజన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.