16-10-2025 08:14:12 AM
మహబూబ్ నగర్, (విజయక్రాంతి): ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేసుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge)ని వారి నివాసంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahbubnagar MLA Yennam Srinivas Reddy), జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర రాజకీయాల గురించి వారు చర్చించారు.