14 August, 2026 | 1:29 AM

అరులైన వారందరూ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి

14-08-2026 12:00 AM

తాడ్వాయి,ఆగష్టు,13( విజయ క్రాంతి ): అర్హులైన వారందరూ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సర్పంచ్ పోచయ్య తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం అర్హులైన వారందరి కోసం పెన్షన్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని, అందుకోసం అందరూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పారిశుద్ధ్యలోపం నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షులు కంకణాల బాల్ చంద్రం, కార్యదర్శి సవిత, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.