తిరంగా ర్యాలీలో భిక్కనూర్ బీజేపీ నాయకులు
14-08-2026 12:00 AM
భిక్కనూర్, ఆగస్టు 13(విజయ క్రాంతి): కామారెడ్డిలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో భిక్కనూర్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






