calender_icon.png 15 October, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రైజింగ్ విజన్-2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి

14-10-2025 08:25:26 PM

గద్వాల (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంటును రూపొందిస్తోందని ఈ సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామ్యం పొందేలా సిటిజన్ సర్వే చేపట్టారు. అక్టోబర్ 10వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో రాష్ట్ర ప్రజలు, ఎన్.ఆర్.ఐ లు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

కాగా, ఈ తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వే లో రాష్ట్రంలోని ప్రతీ ఉద్యోగి పాల్గొని తమ విలువైన సలహాలు, సూచనలు అందించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తూ నేడు సర్క్యులర్ జారీ చేసింది. ఈనెల 25 వ తేదీ వరకు జరిగే విజన్-2047 సర్వేలో అందరు ఉద్యోగులు పాల్గొనడం తోపాటు ఈ సర్వే లింక్ ను, QR కోడ్ ను తమ తమ కార్యాలయాల్లో ప్రదర్శించడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఆ సర్క్యులర్ లో ఆదేశించారు. ఈ సర్వేలో పాల్గొనేందుకుగాను http//www.telangana.gov.in/telanganarising/ అనే లింక్ ద్వారా పాల్గొనాలని ఒక ప్రకటనలో తెలియచేసారు.