20-12-2025 05:29:42 PM
కరీంనగర్,(విజయక్రాంతి): రోడ్డుపై చెత్త చేసిన దుకాణ యజమానులకు మున్సిపల్ అధికారులు 2500 రూపాయల జరిమానా విధించారు. శనివారం డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, శానిటరీ సూపర్వైజర్ శ్యామ్ రాజ్, శానిటరీ ఇన్స్పెక్టర్ గట్టు శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ స్వామిలతో నగరంలోని ఇందిరా చౌక్ లో తనిఖీలు నిర్వహించారు. ఎస్వీ టిఫిన్స్, ఏఆర్ పాన్ షాప్, ఏఆర్ బిర్యాని సెంటర్ చెత్త రోడ్డుపై వేయగా వారికి రూ.2,500 జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో జవాన్లు, కార్మికులు పాల్గొన్నారు.