calender_icon.png 15 October, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ సీన్స్ కోసం రాత్రంతా..

14-10-2025 12:00:00 AM

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. మైత్రీమూవీమేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఇందులో శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయకి మమిత సినిమా విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. “-డ్యూడ్’లో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది.

ఇప్పటివరకూ ‘కురల్’ లాంటి పాత్ర చేయలేదు.. చాలా హానెస్ట్ క్యారెక్టర్. -ఈ సినిమాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు నాకు సవాలుగా అనిపించాయి. ఆ సీన్స్ కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. షూట్ సమయంలో ఆందోళన లేకుండా సీన్ మీద ఫోకస్ చేశా. నేను ఎప్పుడైనా షూట్‌కు ముందు బాగా ప్రిపేర్ అయి ఉండాలని చూసుకుంటాను. అందుకే ఇది నాకు ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా అనిపించింది. -ప్రదీప్ రంగనాథ్ మల్టీ ట్యాలెంటెడ్. సెట్స్‌లో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. -శరత్‌కుమార్ లాంటి సీనియర్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. మైత్రీ మూవీ మేకర్స్ చాలా పాషనేట్ ప్రొడ్యూసర్స్. సినిమా చాలా గ్రాండ్‌గా తీశారు” అని తెలిపింది.