15-10-2025 01:18:02 AM
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘తెలుసు కదా’. శ్రీనిధిశెట్టి, రాశిఖన్నా ఇందులో హీరోయిన్లు. స్టులిస్ట్ -ఫిల్మ్ మేకర్ నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సిద్ధు విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
నీరజ ఈ కథను నాకు ఏడాదిన్నర క్రితమే చెప్పారు. చాలా ఎక్సైట్ అయ్యాను. అయితే, క్యారెక్టరైజేషన్ మీద ఇంకా వర్క్ చేద్దామని చెప్పాను. నీరజ ఐడియా చాలా కొత్తగా ఉంది. అయితే, క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని తనకు ముందుగానే చెప్పా. ‘టిల్లు స్క్వేర్’ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలని భావించాం.
ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. వరుణ్ పాత్రలో నన్ను చూసి ప్రేక్షకులు కచ్చితంగా షాక్ అవుతారు. వరుణ్ మామూలుగా కనిపిస్తాడు.. తన ఆలోచనలు మాత్రం చాలా రాడికల్‌గా ఉంటాయి.
కొత్తవారితో కలిసి పనిచేయడం ఒక రిస్క్‌తో కూడుకున్న పనే. అయితే రిస్క్‌తోపాటు ఒక రివార్డు కూడా ఉంటుంది. నీరజతో పని చేయాలనుకున్నప్పుడు ఎలాంటి టీమ్‌తో వెళ్లాలనేది ముందుగానే నిర్ణయించుకున్నాం. చాలా ఎక్స్‌పీరియన్స్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. కొత్త డైరెక్టర్ చేసిన సినిమాలా ఎక్కడా అనిపించదు. నేను డైరెక్షన్ చేసే ఆలోచనైతే ఉంది. అయితే దానికి సమయం కుదరాలి.
ఏ సినిమా విషయంలోనైనా హిట్ అయితే అందరికీ క్రెడిట్.. పోతే నా ఒక్కడికే బ్లేమ్. దానికి తెగించే ఇక్కడ ఉన్నా. -డైలాగ్ చెప్పి కార్వాన్‌లోకి వెళ్లిపోవాలని నాకూ ఉంటుంది. నేను ఇన్వాల్వ్ అవ్వకుండా సినిమా చేయడమనేది నా కల. కానీ, నాకు ఆ లగ్జరీ లేదు. -ఫిలిం మేకింగ్‌లో ఎక్కువ ఉండటంతో ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఆడియన్స్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌నే నేనూ ఎంజాయ్ చేస్తున్నా. నేను అనుకున్నది వాళ్లు కూడా ఫీలవుతున్నారా.. లేదా అనేది కిక్ ఇస్తోంది.
స్త్రీలోలుడు నిందారోపణపై స్పందించిన సిద్దూ
“ఇటీవలి పరిణామాలపై సిద్దూ స్పందించారు. ‘చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది అడగడం మర్యాద కాదు. ఆవిడ ‘ఉమెనైజర్’ అన్న పదం నాకు వినపడింది. కానీ, లైట్ తీసుకున్నా. వాళ్లు రియలైజ్ అవ్వాలి. ఆవిడ సరిగ్గా ఈవెంట్‌కు 10 నిమిషాల ముందు ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేసింది.. కట్ చేస్తే మైక్ పట్టుకుని అలా మాట్లాడింది” అన్నారు సిద్దూ. ఇంతకీ ఏం జరిగిందంటే..
సిద్దూ సినిమా ‘తెలుసు కదా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఓ మహిళా విలేకరి ‘రియల్ లైఫ్‌లో ఉమెనైజరా మీరు?’ అని అడిగారు. ఈ ప్రశ్న ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. లేడీ జర్నలిస్ట్ అయి ఉండీ.. ఇలా అడగడమేంటి? అంటూ ఆమె తీరును తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దూ స్పందించారు.