calender_icon.png 20 October, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

21 ఏళ్లకే చట్టసభలకు

20-10-2025 02:12:12 AM

యువత పోటీ చేసేలా చట్ట సవరణ చేయాలి 

అర్హత వయస్సు 25 నుంచి 21 ఏళ్లకు తగ్గాలి 

  1. అసెంబ్లీలో తీర్మానం చేస్తాం 
  2. దేశ సమగ్రత కోసం గాంధీ కుటుంబం ప్రాణాలర్పించింది 
  3. జూబ్లీహిల్స్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కుట్రలు
  4. సీఎం రేవంత్‌రెడ్డి
  5. సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు ప్రదానం 

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): దేశాన్ని యువత నడిపించేందుకు ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు 21 ఏళ్ల కే అర్హత ఉండే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలంటే అర్హత వయసు 25 ఏళ్లు ఉందని, అదే ఐఏఎస్, ఐపీఎస్‌లకు 21 ఏళ్ల అర్హతనే ఉందని, వారు దేశాన్ని నడిపిస్తున్నారని తెలిపారు.

అలాంటప్పుడు 21 ఏళ్లకే యువత ఎందుకు పోటీ చేయ కూడదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ హయాంలో ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని, పోటీ చేసే అర్హతను కూడా 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్నారు. ఆదివారం చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్‌గాంధీ సదర్భావన యాత్ర సంస్మరణ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యులు సల్మాన్‌ఖుర్షీద్‌కు రాజీక్‌గాంధీ సద్భావన అవార్డును సీఎం ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..  ఎమ్మెల్యేగా 21 ఏళ్లకే పోటీ చేసేలా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం అమోదింపచేస్తామన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలోనూ సవరణలు చేయా లని, అందుకు సీడబ్ల్యసీ సభ్యుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కృషి చేయాలని కోరారు. గాంధీ కుటుంబంతో సల్మాన్ కుర్షీద్ అనుబంధం ఈనాటిది కాదన్నారు. 

గాంధీ బ్రిటీషర్లపై పోరాడి స్వాతంత్య్రం సాధించారని, అయితే గాం ధీని బ్రిటీషర్లు ఏమి చేయలేకపోయారని, కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మతతత్వ వాదులు గాంధీని పొట్టన పెట్టుకున్నారని సీఎం మండిపడ్డారు.   35 ఏళ్లుగా రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర జరుగుతోందని, గాంధీ భారత దేశానికి పర్యాయపదమన్నారు.

భారత్‌లో అన్ని మతాల సహజీవనం స్ఫూర్తినిస్తుందని, దేశానికి గాంధీ కుటుంబం కూడా ఎంతో  స్ఫూర్తినిచ్చిందని  పేర్కొన్నారు. ఇందిరాగాంధీ వారసత్వం, త్యాగాలను రాజీవ్‌గాంధీ పుణికిపుచ్చుకున్నారని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. మత సామరస్యం దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటప్పుడు రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర చేశారని తెలిపారు. 

బీజేపీకి బీ టీమ్‌గాబీఆర్‌ఎస్.. 

రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి మండి పడ్డారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందంతో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్ 21 శాతం ఎవరికి చేరిందో చెప్పాలని  డిమాండ్ చేశారు. బీజేపీ గెలిచిన 8 పార్లమెంట్ నియోజక వర్గాల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్ రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.  

-సీఎంగారు ఆ ఒక్క హామీని నేరవేర్చండి : వీహెచ్ 

అసెంబ్లీ ఎన్నికల్లో  మహిళలకు రూ.2,500 ఇస్తామన్న హామీని అమలు  చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హ నుమంతరావు సీఎంని కోరా రు. ఈ పథకం అమలు కాకపోవడంతో ప్రతిపక్ష పార్టీలతో పాటు మహి ళలు ఎక్కడికి వెళ్లినా అడుగుతున్నారని  గుర్తు చేశారు. కార్యక్రమలో   పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్,  మంత్రులున్నారు.