20-10-2025 01:16:42 AM
* జగదభిరాముడు శ్రీరాముడు జన్మించిన నగరి అయోధ్యాపురి ధగధగాయమానంగా ప్రజ్వరిల్లుతున్నది. భక్తజనం వెలిగించిన లక్షలాది దీప కాంతులతో ప్రకాశిస్తున్నది. దీపోత్సవంలో భాగంగా ఆదివారం సరయు తీరాన నిర్వహించిన ఈ వేడుక అరుదైన ఘనత సాధించింది. ఏకకాలంలో భక్తులు 26.17 లక్షల దీపాలు వెలిగించారు. 2,128 మంది నదీ మాతకు హారతినిచ్చారు. ఈ ఫీట్లకు గిన్నిస్‌బుక్‌లో స్థానం లభించింది.
లక్నో, అక్టోబర్ 19: దీపావళి పర్వదినా న్ని పురస్కరించుకుని రామజన్మభూమి అయోధ్యాపులోని రామ్ కీ పైడీ ఘాట్‌లో ఆదివారం రాత్రి అట్టహాసంగా దిపోత్సవం జరిగింది. ఏకకాలంలో భక్తులు 26.17 లక్షల దీపాలు వెలిగించారు. 2,128 మంది ఒకేసారి నదీ మాతకు హారతినిచ్చారు. ఈ రెండు అరుదైన ఫీట్లకు గిన్నిస్‌బుక్‌లో స్థానం లభించింది. డ్రోన్‌ల సాయంతో గిన్నిస్ బుక్ ప్రతినిధులు దీపాలను లెక్కించారు.
అనంతరం ఆ రాష్ట్ర పర్యాటక, సాం స్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్‌కు రికార్డు పత్రాలు అందజేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ, అయోధ్య ఆలయ పాలకవర్గం, రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ యాజమాన్యం సంయుక్తంగా గిన్నిస్ అవార్డులు అందుకున్నాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్ మాట్లాడుతూ.. సరయూ నదీ తీరంలో రామ్ కీ పైడి వద్ద దీపావళి పండుగ సందర్భంగా జరిగిన ఈ దీపోత్సవం అద్భుతమైన ప్రదర్శన అని కొనియాడారు.
అంతకుముందు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నదీమాతకు హారతినిచ్చారు. అయోధ్య రామమందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి ఆయన రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలోని కళాకారులు ఆశీనులైన రథాన్ని లాగారు. దీపోత్సవం నేపథ్యంలో అయోధ్యకు దేశ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. వేడుకలకు హాజరైన వారితో అయోధ్యాపురి కిటకిటలాడుతున్నది.
యూపీకి అంతర్జాయ ఖ్యాతి: సీఎం యోగి ఆదిత్యనాథ్
అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన దీపోత్సవ్ ఉత్తరప్రదేశ్‌కు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల విశ్వా సాలకు గౌరవిస్తూ, వారి మనోభావాలకు అనుగుణంగా తమ ‘డబుల్ ఇంజిన్’ సర్కా ర్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఉత్సవంలో 26.71 లక్షలకు పైగా దీపాలు వెలిగించిన వారికి అభినందనలు తెలిపారు. వేడుక విజయవంతం కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతున్నదన్నారు.