18-10-2025 08:31:56 PM
చిట్యాల (విజయక్రాంతి): బీసీల న్యాయమైన ఆకాంక్షలకు ఏర్పడ్డ అడ్డంకులను నిరసిస్తూ శనివారం చిట్యాల మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం చిట్యాల పట్టణ, మండల కమిటీ పూర్తి మద్దతును ప్రకటిస్తూ బంధులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ బీసీలకు న్యాయంగా దక్కవలసిన 42 శాతం వాటాను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని, మా వాటా మాకు దక్కేంతవరకు నాయి బ్రాహ్మణులు రాష్ట్రవ్యాప్తంగా ముందుండి ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని అన్నారు. ఇప్పటివరకు నాయి బ్రాహ్మణులు అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి ఉందంటే నేడు కొనసాగుతున్న రాజకీయాల పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం చిట్యాల పట్టణ అధ్యక్షుడు అమరోజు వెంకటేశం, అమరోజు వెంకన్న, వావిళ్ళ కృష్ణయ్య, చికిలంమెట్ల సత్తయ్య, చెన్నారపు నరసింహ, చికిలంమెట్ల పాపయ్య, అమరోజు మధుసూదన్, అక్కెనపల్లి సురేష్, గడిగల శేఖర్, వేముల యాదగిరి, మునుగోటి మహేష్, అమరోజు మహాలింగం, చికిలం మెట్ల యాదయ్య, చికిలంమెట్ల శేఖర్, గడియల గడి గల శేఖర్, అమ రోజు ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.