20-10-2025 02:02:04 AM
చిరుదివ్వెలతో చీకట్లను పారదోలేది దీపావళి
చిరు దివ్వెలతో చీకట్లను పారదోలేది దీపావళి. రాష్ట ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు ఇవ్వాలని కోరుకుంటున్నా. పేదలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం కృషి చేస్తోంది. సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సమృద్ధి ఎల్లప్పుడూ మీ ఇంట వెల్లివిరియాలి. జాగ్రత్తలతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలి.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
రెండేళ్ల ప్రజాపాలనలో.. ప్రజల జీవితాల్లో చీకట్లు తొలిగిపోయాయి
తెలంగాణ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. రెండేళ్ల ప్రజాపాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలిగిపోయాయి. అన్ని వర్గాల ప్రజల సం క్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచ్చింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపు కోవాలి. దీపాల కాంతులతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరా యాలి. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నా, పెద్దలందరూ ప్రమాదాలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు పాటించి, ఆనందంగా పండుగను జరుపుకోవాలి.
సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజల జీవితాల్లో ఆనంద వెలుగులు నిండాలి
అజ్ఞానపు మనస్సును తొలగించుకుని, ప్రతీ మనిషి తనలో జ్ఞానపు ఉషస్సులను వెలిగించుకోవాలనే స్ఫూర్తిని దీపావళి పర్వదినం అం దిస్తుంది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన రాష్ట్రంలో ప్రగతి వెలుగులు పం చింది. తెలంగాణ ప్రజల జీవితాల్లో కమ్ముకున్న చీకట్లు తొలగి ఆనందపు వెలుగులు నిండాలి.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
స్వదేశీ స్ఫూర్తితో దీపావళి జరుపుకుందాం
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. రావణుడిని సంహరించిన అనంతరం విజయోత్సహంతో రాముడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా జరుపుకునే పండుగే దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికిది ప్రతీక. ఈ దీపావళి ప్రజలకు చాలా ప్రత్యేకం. జీఎస్టీ స్లాబు తగ్గింపు.. అదనపు పొదుపు, అదనపు ఆనందంతో ఇళ్లను వెలిగిస్తోందని ఆశిస్తున్నా. జాతీయ ఉత్పత్తులను ఎంచుకోవడం, చేతివృత్తుల వారికి మద్దతివ్వడం, ఆత్మనిర్భర్ భారత్ వెలుగును వ్యాప్తి చేయడం ద్వారా స్వదేశీ స్ఫూర్తితో ఈ దీపావళిని జరుపుకుందాం.
ఎన్.రాంచందర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు