05-01-2026 01:52:20 AM
నూతనకల్ సర్పంచ్ మల్లికార్జున్
నూతనకల్, జనవరి 4: గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని నూతనకల్ గ్రామ సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్ కోరారు.ఆదివారం గ్రామంలోని ప్రధాన వీధులలో కొత్తగా ఏర్పాటు చేసిన వీధిలైట్లను ఆయన పర్యవేక్షించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని, అన్ని రంగాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.
వీధిలైట్ల ఏర్పాటుతో చీకటి సమస్య తొలిగిందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని, అభివృద్ధి పనుల్లో ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఉప్పుల వీరు యాదవ్, బండి అనిల్, బత్తిని లింగయ్య, సంగినేని సురేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.