calender_icon.png 10 January, 2026 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్లూరు గ్రామ సమస్యలపై పాలవర్గం తొలి సమావేశంలో తీర్మానాలు

09-01-2026 09:20:25 PM

కోదాడ: కోదాడ మండలంలోని అడ్లూరు గ్రామపంచాయతీ మొదటి పాలకవర్గం మీటింగ్ సర్పంచ్ గువ్వల వెంకట్ శిరీష అధ్యక్షతన శుక్రవారం నిర్వహించి గ్రామ సమస్యలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. ఇతర పులిచింతల ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో నుంచి అక్రమ పద్ధతిలో బదిలీ అయిన ప్లాట్లను క్యాన్సిల్ చేసి గ్రామానికి చెందిన 18 సంవత్సరాల నిండిన పిల్లలకు ఇవ్వాలని, మిగిలిన ప్లాట్లను గ్రామపంచాయతీ క్రిందకు తీసుకురావాలని సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి జిల్లా కలెక్టర్, హుజూర్నగర్ ఆర్డీవోకి పంపించడం జరిగింది.

గ్రామంలో ఉన్న యుపిఎస్ స్కూలును గురుకుల పాఠశాలగా మార్చి గ్రామానికి చెందిన పిల్లలకు ఎంట్రన్స్ ఎగ్జామ్తో సంబంధం లేకుండా చదువుకోటానికి అవకాశం కల్పించాలని తీర్మానం చేసి కలెక్టర్ కి పంపించడం జరిగింది. పట్టాలు లేకుండా ఇల్లు కట్టుకున్న వాళ్లకు నోటీసులు పంపించవలసిందిగా తీర్మానించడం జరిగింది. గ్రామపంచాయతీ వాటర్ పైపులైనుకు మోటర్లు పెట్టిన వాళ్లకు తొలగించవలసినదిగా నోటీసులు పంపించాలని తీర్మానం చేయడం జరిగింది. కరెంటు స్తంభాలకు బల్బులు వెయ్యాలని తీర్మానం చేయడం జరిగింది. గ్రామంలో రోడ్ల పక్కన ఉన్న కంప చెట్లను తొలగించవలసినదిగా తీర్మానించారు. వార్డు సభ్యులు పాల్గొన్నారు.