calender_icon.png 10 January, 2026 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు-బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం

09-01-2026 09:56:43 PM

మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన పవరే నారాయణ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.