05-01-2026 01:50:07 AM
కోదాడ (అనంతగిరి) జనవరి 4: అనంతగిరి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నకిరికంటి వీరబద్రమ్మ పాలక వర్గం, శ్రీకర హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డేగ కొండయ్య , కొండపల్లి వాసు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోనీ ప్రజలు మెరుగైన వైద్య సేవలు కోసం ప్రైవేట్ హాస్పటల్ కు వెళ్లకుండా గ్రామంలోనే రక్త పరీక్షలు ఈసీజీ మందులు అందజేస్తున్నారని తెలిపారు.
ఈ మెగా వైద్య శిబిరంలో 200 మంది గ్రామస్తులు పాల్గొన్నారు అడగగానే వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శ్రీకర హాస్పటల్ యాజమాన్యానికి డాక్టర్ రాజేందర్‌కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఉప సర్పంచ్ గవిని రామకృష్ణ వార్డు మెంబర్లు రవి వెంకటయ్య వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సూర్యం హాస్పిటల్ యాజమాన్యం లచ్చిరెడ్డి గ్రామ పెద్దలు సంగబోయిన అంతయ్య నకిరికంటి యల్లయ్య గాదం వెంకన్న మార్తి వేణు తదితరులు పాల్గొన్నారు.