calender_icon.png 10 January, 2026 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

09-01-2026 10:00:11 PM

- భీమారం ఎస్సై శ్వేత

భీమారం, (విజయక్రాంతి): సైబర్ నేరాలపై అందరు అవగాహన కలిగి ఉండాలని భీమారం ఎస్సై శ్వేత సూచించారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో శుక్ర వారం మంచిర్యాల జిల్లా భీమారం కేజీబీవీ (KGBV) పాఠశాలలో విద్యార్థినీలకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎస్సై మాట్లాడారు. సోషల్ మీడియాలో వచ్చే తెలియని లింకులు లేదా ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని, ఎవరికీ ఓటీపీ వివరాలు ఇవ్వకూడదని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే హెల్ఫ్ లైన్ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.

సోషల్ మీడియాను బాధ్యతతో వినియోగించాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పోలీసులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. అనంతరం విద్యార్థినీలకు సైబర్ మోసాలు, ఓటీపీ మోసాలు, ఏపీకే (APK) ఫైళ్ల వల్ల కలిగే ప్రమాదాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం, పిల్లలపై వేధింపులు, ఆత్మహత్య ఆలోచనలు, అలాగే విద్య ప్రాధాన్యత వంటి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.