09-01-2026 09:23:21 PM
దర్గా దయాకర్ రెడ్డి చొరవతో సమస్యకు పరిష్కారం
మేడిపల్లి,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మల్లికార్జున నగర్ 40 ఫీట్ రోడ్డులో కొద్దిరోజుల క్రితం మంచినీటి పైప్ లైన్ పగిలిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం సీనియర్ నాయకులు మాజీ గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి దృష్టి కి తీసుకుపోయారు. దీంతో స్పందించిన ఆయన జలమండలి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించి పనులు మొదలు పెట్టి సమస్య పరిష్కరించారు.సమస్య పరిష్కారం కావడంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు.