calender_icon.png 8 January, 2026 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘రాయలసీమ లిఫ్ట్’పై రేవంత్ వ్యాఖ్యలు సత్యదూరం!

05-01-2026 01:53:32 AM

  1. సీమ లిఫ్ట్‌పై రేవంత్ వ్యాఖ్యలు సత్యదూరం!
  1. తెలంగాణ సీఎం తీరును తప్పుబట్టిన ఏపీ ప్రభుత్వం
  2. రాజకీయ లబ్ధికేనని విమర్శ
  3. వైసీపీ హయాంలోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని స్పష్టీకరణ
  4. 2020లోనే ప్రాజెక్టు నిలిపేయాలని ఎన్జీటీ, కేంద్రం ఆదేశించిందని వెల్లడి

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి) : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.  అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారంసీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం ఆదివారం స్పందించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయించానన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిం ది.

తెలంగాణ ప్రయోజనాల కోసం పనులు నిలిపివేశారన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధ మని పేర్కొంది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణలో అధికార, విపక్షాలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శించింది. ఏపీ నీటి హక్కులు, సీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని స్పష్టం చేసింది. ‘జగన్ హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టారని, సీమకురోజుకు 3 టీఎంసీలంటూ ప్రక టనలతో వైసీపీ ప్రభుత్వం పనులు చేపట్టిందని పేర్కొంది.

జగన్ ప్రచారంతో లిఫ్ట్ పనులపై అప్పటి తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభు త్వం కోర్టులో కేసులు వేసిందని తెలిపింది. తెలంగాణ ఫిర్యాదులను విచారించి.. అనుమతులు లేనందున పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జటీ, కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేసింది. 2024లో కూటమి ప్రభు త్వం అధికారంలోకి రాకముందే కేంద్రం పనులను నిలిపివేయించిందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే అసెంబ్లీలో కృష్ణానదీ జలాలపై శనివారం నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘వైఎస్ జగన్‌కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి.. కేసీఆర్ భుజం తట్టి ప్రోత్సహిస్తే.. తాను చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగే షన్ ప్రాజెక్టును ఆపించానని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపాలని అడిగితే మా మీద గౌరవంతో చంద్రబాబు ఆపించారని స్పష్టం చేశారు. ఆ పనులు ఆగాయో.. లేదో తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీని పంపించాలన్నారు.

చంద్రబాబు నాయకత్వంలో పని చేసిన తాను.. ఆ పార్టీని వదిలి పెట్టానని, అలాంటిది నేను తెలంగాణకు అన్యాయం చేస్తానా అని ప్రశ్నించారు. మొదట తనకు తెలంగాణ.. ఆ తర్వాతే పార్టీ అని, నాలాంటి వాళ్లు తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెడతారా? అన్నా రు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని కంక ణం కట్టుకొని బయలుదేరానని తెలిపారు. కాగా, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాజాగా ఏపీ స్పందించడం, ఆయన వ్యాఖ్యలను ఖండించడం ఇరు రాష్ట్రా ల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.