09-01-2026 09:49:46 PM
కుభీర్: కుభీర్ మండలంలోని సిరిపెల్లి (హెచ్) గ్రామంలో విద్యుత్ షాట్ సర్కుట్ కారణంగా గంగాకిషన్ కు చెందిన ఇల్లు కాలి భూడిదయింది. గంగాకిషన్ శబరిమలైకి వెళ్లగా కుటుంబ సభ్యులు వేరె ఊరు వెళ్లారు. ఒక్కసారిగా పొగతో కూడిన మంటలు చలారేగడంతో చుట్టుపక్కల ఇండ్ల వారు గమనించి అగ్నిమపాక సిబ్బందికి సమాచారం అందించారు.
మంటలు ఆరెలోపు ఇంట్లోని సామాను మొత్తం కాలి పోయింది ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లాయింది. కాగా రెవెన్యూ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి రూ.10లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. కట్టుబట్టలతో మిగిలిపోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.