calender_icon.png 30 September, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే ఎన్నికలలో అన్ని స్థానాలు పోటీ

30-09-2025 08:44:41 PM

గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి బిజెపి జిల్లా నాయకులు.

మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్

మనోహరాబాద్ (విజయక్రాంతి): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాలు కైవసం చేసుకోవడానికి పార్టీ కార్యకర్తలు అభిమానులు యుద్ధ ప్రాతిపాదికన కృషి చేయాలని రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మాజీ ఉపాధ్యక్షులు బిజెపి జిల్లా నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్ తెలిపారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో మండల మండల పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ ఆద్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలం నుండి ఎంపీటీసీ, జెడ్పిటిసి స్థానాలు కైవసం చేసుకోవాలని దానికోసం ప్రతి ఒక్క కార్యకర్త తమ వంతు కృషిగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్ కూచారం మాజీ సర్పంచ్ జక్కిడి నరేందర్ రెడ్డి , భాషబోయిన చంద్రశేఖర్, అసెంబ్లీ కన్వినర్ సాయి బాబా, మాజీ మండల అధ్యక్షులు నరేందర్ చారి, సీనియర్ నాయకులు, పురం మహేష్, ప్రభాకర్ గౌడ్, కొల్తూరి నరేష్ లు ఉన్నారు.