30-09-2025 08:46:29 PM
మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగుడా మున్సిపల్ కార్పోరేషన్ పరిధి 25వ డివిజన్ లోని విహరిక కాలనీ, శ్రీ సాయి నగర్ కాలనీ, సాయి హిల్స్ కాలనీ,క్రాంతి కాలనీ, పలు డివిజన్ లలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, స్థానిక 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి డివిజన్ లోని కాలనీలలో మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి తెలంగాణ సంప్రదాయ బద్ధంగా సద్దుల బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా ఆటపాటలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కాలనీల అధ్యక్షకార్యదర్శులు, పెద్దలు, మహిళలు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.