11-10-2025 12:34:30 AM
వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్...
కరీంనగర్, అక్టోబరు 10 (విజయ్ క్రాంతి): కరీంనగర్ పట్టణం లోని మహిమాన్విత భవ్య, దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో శుక్రవారం శుక్రవారం సంకష్టహర చతుర్దశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజ, గణపతి హోమ కా ర్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమా ర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలుపాల్గొన్నారు.