calender_icon.png 26 October, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాషాయ జెండా తొలగింపు తీవ్ర వివాదానికి తెర లేపింది..

25-10-2025 07:05:02 PM

కోనరావుపేటలో ఎంపీడీవో కార్యాలయం ముందు బీజేపీ శ్రేణుల బైఠాయింపు..

కోనరావుపేట (విజయక్రాంతి): ​దీపావళి పండుగ వేళ కాషాయ జెండా తొలగింపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామంలో దీపావళి రోజున గ్రామ కార్యదర్శి మహమ్మద్ అప్సన కాషాయ జెండాను తొలగించారనే ఆరోపణలతో బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున భగ్గుమన్నారు.​ ఈ ఘటనపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు మిర్యాల కార్ బాలాజీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కోనరావుపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.​మత మనోభావాలను దెబ్బతీసే చర్యగా ఈ జెండా తొలగింపును బీజేపీ అభివర్ణించింది. పండుగ రోజున కావాలనే తమ జెండాను తొలగించి, ఉద్రిక్తత సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.​ నిరసన అనంతరం, బీజేపీ నాయకులు ఎంపీడీవో శంకర్ రెడ్డి, తాసిల్దార్ వరలక్ష్మిలను కలిసి, తమ నిరసనకు గల కారణాలను వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. ​

కాషాయ జెండా తొలగింపునకు పాల్పడిన గ్రామ కార్యదర్శి మహమ్మద్ అప్సనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోనీ సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యదర్శిపై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.​ రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ గొట్టే రామచంద్రం, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, మండల ప్రధాన కార్యదర్శి బైరిగోని సురేష్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు చింతల పరుశరాములు, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు తీగల జయశ్రీ, సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎక్కలదేవి జలందర్, సీనియర్ నాయకులు జింక వెంకటి, తీగల రవీందర్ గౌడ్ ఆసరి దేవరాజు, బొల్లారం తిరుపతి, ముష్ణం  శ్రీనివాస్, దుర్గం తిరుపతి, చల్ల జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.