28 August, 2026 | 1:58 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

వర్చువల్‌గా కోర్టుకు అల్లు అర్జున్ హాజరు

23-06-2026 12:46 AM

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు విచారణకు సోమవారం హీరో అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతివ్వడంతో ముంబై నుంచి అల్లు అర్జున్ వర్చువల్‌గా అటెండ్ అయ్యారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ11గా పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. మిగిలిన నిందితులు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరయ్యారు.

సోమవారం ఉదయం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టు ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. సినిమా షూటింగ్‌ల కారణంగా అల్లు అర్జున్ ముంబైలో ఉన్నారని, అక్కడి నుంచి వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాది మెమో దాఖలు చేయగా.. అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను నాంపల్లి కోర్టు జులై 6కు వాయి దా వేసింది.