23 June, 2026 | 2:34 AM

తెలంగాణ నేపథ్యం కుటుంబ కథకు ముహూర్తం కుదిరింది

23-06-2026 12:50 AM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్‌గా నటించనుంది.

ఈ మూవీ టీమ్ తాజాగా డైరెక్టర్ సుకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుకుమార్ మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భం గా హీరోయిన్ నాగదుర్గ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. కంటెంట్ డ్రివెన్ ఫిలింస్ చేయడంలో ప్రసిద్ధి పొందిన సుకుమార్, బన్నీ వాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై మూవీ లవర్స్‌లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.

ప్రామిసింగ్ మూవీస్ చేస్తున్న ప్రియదర్శి హీరో కావడం, ఏ ఫోక్ సాంగ్ చేసినా మిలియన్స్‌లో వ్యూస్ రాబట్టే క్రేజ్ ఉన్న నాగదుర్గ హీరోయిన్‌గా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారింది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా ఈ సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందించనున్నారు. ఈ నెల 25న ప్రారంభం కాను న్న ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ క్రేజీ కాంబో చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.