calender_icon.png 14 September, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ అరెస్టు ఉద్దేశపూర్వకమే

14-12-2024 01:27:38 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కార్యక్రమ నిర్వాహకులు సంబంధి త అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినా.. అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందని శుక్రవారం ఒక ప్రక టనలో ఆరోపించారు.

కార్యక్రమ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది.. అది చేయకుం డా వ్యక్తిగతంగా టార్గెట్ చేయ డం సరికాదన్నా రు. రాష్ర్టం లో సినీనటులను ఉ ద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనే విషయం మరోసారి నిరూపితమైందన్నారు. ఈ అరెస్టును, పాలకుల అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.