calender_icon.png 28 August, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షంలోనూ 108 సిబ్బంది సేవలు అద్భుతం

28-08-2025 07:54:13 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ సమీపంలో భారీ వర్షం కారణంగా కన్నయ్య తాండాకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురైనప్పటికీ, 108 సిబ్బంది ధైర్యసాహసాలతో మూడు కిలోమీటర్లు ప్రయాణించి, ప్రసవ నొప్పితో బాధపడుతున్న పాల్వంత అనే మహిళను బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి సురక్షితంగా తరలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు 108 సిబ్బందిని అభినందించారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా 108 సేవలను వినియోగించుకోవాలని ఈఎంటి ప్రసాద్ తెలిపారు.