28-08-2025 08:17:20 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యా బోధనలో విద్యార్థులకు సులభంగా సమర్థవంతంగా అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు ప్రవేశపెట్టిన టిఎల్ఎం ప్రోగ్రాం(TLM Program)లో మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యాయులు ప్రతిభ చూపారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన టిఎల్ఎం ప్రదర్శనలో వివిధ విభాగాల్లో 8 మందిని ఎంపిక చేశారు. విద్యార్థులకు సులువుగా ఆయా పాఠ్యాంశాల్లో అర్థమయ్యే విధంగా చిత్రాలు, మ్యాపులు, ఫ్లాష్ కార్డులు, మోడల్స్, స్లైడ్స్, క్విజ్, విద్య ఆటలతో విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా కృషి చేశారు. తెలుగులో సిహెచ్ ప్రదీప్ (సూదనపల్లి), టీ. సునీత (బలపాల), ఇంగ్లీషులో ఫర్హ సుల్తానా (ఉగ్గంపల్లి), కే.సుమతి (పెద్ద ముప్పారం), గణితం లో శ్రీలక్ష్మి (లక్ష్మీనరసింహపురం), కే.రాధిక (చింతలపల్లి), ఎన్విరాన్మెంటల్ సైన్స్లో వి. నవత (రాజుల కొత్తపల్లి), ఎం. కళ్యాణి (విఎస్ నగర్) ఎంపికయ్యారు. వీరంతా రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రదర్శనలో పాల్గొంటారు.