28-08-2025 08:00:12 PM
మాజీ ఏఎంసీ ఛైర్మన్ పత్తిపాక వెంకటేష్
ధర్మపురి (విజయక్రాంతి): వెల్గటూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరు పొందిన కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని మాజీ ఏఎంసీ ఛైర్మన్ పత్తిపాక వెంకటేష్(Former AMC Chairman Pathipaka Venkatesh) ఒక ప్రకటనలో తెలిపారు. నిత్యం భక్తులతో రద్దిగా ఉండే ఈ ప్రాంతం రవాణా సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే జగిత్యాల నుండి వెల్గటూర్ కు వచ్చే బస్సులు కోటిలింగాల వరకు వెళ్ళేట్లు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న హరిత హోటల్ ను అందుబాటులోకి తెచ్చి ధూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు వసతి ఏర్పాట్లు చేయాలన్నారు. శాతవాహనులు ఏలిన నేలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.