28-08-2025 08:11:22 PM
వాగు ప్రవాహంలో చిక్కుకున్న మహిళను కాపాడిన గాంధారి ఎస్సై..
ప్రమాదపు అంచున బిడ్జ్, విద్యుత్ స్థంభలు వంగడం తో విద్యుత్ సరఫరాలకు నిలిపివేత
రెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.
నీట మునిగిన పంట పొలాలు వేల ఎకరాల్లో పంట నష్టం
గాంధారి (విజయక్రాంతి): మంగళవారం రాత్రి నుండి కుండపోత వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో గాంధారి పెద్దవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. వాగు బ్రిడ్జ్ కు ఆనుకొని వెళ్తుండడంతో వాగుకు ఇరువైపులా ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం నీటి మునిగాయి. గురువారం రోజున ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి వాగు పక్కనే ఉన్న ఇంట్లో ఆకస్మాత్తుగా నీరు రావడంతో వాగు నీటిలో ఒక మహిళ చిక్కుకుంది. గాంధారి మండలంలోని బ్రిడ్జి పక్కనే ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్నటువంటి ఇంట్లోకి నీరు రావడంతో ఇంట్లో ఉన్న ఆమె కేకలు వేయగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఆంజనేయులు చేరుకొని భారీ వర్షాన్ని, నీళ్లను సైతం లెక్కచేయకుండా నడుముకు తాడు కట్టుకొని వెళ్లి స్థానికుల సహాయంతో మహిళను బయటకు తీసుకువచ్చారు. దీంతో పానపాయం లేకుండా ఆమె బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదివరకు ఎప్పుడూ లేనంతలా బ్రిడ్జ్ కానుకుని ఉధృతంగా నీరు ప్రవహిస్తూ ఉండడంతో నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే బ్రిడ్జి ప్రమాదంలో ఉన్నట్టే అని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. వర్షం కారణంగా వాగు సమీపంలో ఉన్నటువంటి గంగమ్మ గుడి కూడా కొట్టుకుపోవడం జరిగింది.. ఇది గాంధారి చరిత్రలోనే చెప్పుకోదగ్గ విషయం. అంతేకాకుండా కామారెడ్డి నుండి వచ్చే హెవీ విద్యుత్ స్తంభాలు నీటి ప్రవాహానికి వంగిపోవడంతో విద్యుత్ సరఫరా వెంటనే నిలిపివేయడం జరిగిందని వర్షం తగ్గుముఖం పడితే గాని కరెంట్ సరఫరా అయ్యే పరిస్థితి లేదు అని చెప్పి విద్యుత్ అధికారులు తెలిపారు.మండల కేంద్రంలో శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి ఇండ్లలో ఉన్నటువంటి దాదాపు 100 మంది కొరకు రెండు పునారా వస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మండల అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా ప్రైమరీ పాఠశాలలను ఎంపిక చేసి అధికారులు వారికి పునారా వాసం కేంద్రం ఏర్పాటు చేసి భోజన సదుపాయం కల్పించడం జరిగింది. అదేవిధంగా మండలంలోని గుజ్జుల్ వాగు, బొప్పాజీవాడి వాగు, పెద్ద సంఘం,సర్వపూర్ వాగు పొంగి పోర్లడం తో ఆ వర్షపు నీరుతో పంట పొలాలు నీట మునిగాయి.