14-11-2025 12:16:21 AM
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
వాషింగ్టన్, నవంబర్13: దేశ రాజధాని ఢిల్లీ పేలుళ్ల ఘటనపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్య లు చేశారు. ఇది ముమ్మాటికి ఉగ్రవాద దాడే అని తెలిపారు. అత్యంత పేలుడు పదార్థాలతో నిండిన కారు పేలిపోయి చాలా మంది మరణించారు అని ఆయన అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించడంలో భారత్‌కు ఎవరి సాయం అవసరం లేదు.. అధికారుల పనితీరు ప్రశంసనీయం అని కొనియాడారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం కెనడాలో జరిగిన జీ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మార్కో రుబియో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలోని ఎర్రకోట పేలుళ్ల దర్యాప్తులో భారత దేశం వ్యవహరించిన తీరును మార్కో ప్రశంసించారు. పేలుళ్ల దర్యాప్తులో భారతదేశానికి సహాయం చేయడానికి అమెరికా ముందుకొచ్చిందన్నారు. అయితే భారత అధికారులు దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, వారికి మా సహాయం అవసరంలేదని మార్కో స్పష్టం చేశారు.