11-01-2026 03:24:32 PM
మంథని,(విజయ క్రాంతి): మంథని పట్టణంలోని పలు దేవాలయాలలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని హనుమాన్, మహా గణపతి,శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో రాష్ట్ర ప్రజలందరూ... మంథని నియోజకవర్గ ప్రాంత వాసులు అందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.