16-07-2025 12:00:00 AM
బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామంలో ఘటన.
నాగర్ కర్నూల్ జులై 15 (విజయక్రాంతి): గుర్తు తెలియని దుండగుల చేతిలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రా మంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేందుకు దాతల సాయంతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు.
ముసుగులోనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కుడి చేతి వేలు విరిగి కింద పడింది. దీని గమనించిన దళిత సంఘాల నేత లు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తుచేపడుతున్నారు.