calender_icon.png 16 July, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంప్ యార్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక రోడ్ మ్యాప్..

16-07-2025 04:47:37 PM

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్,(వికాయక్రాంతి): కరీంనగర్ శివారులో బైపాస్ రోడ్డులో అనేక సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న సమస్య పరిష్కారానికి ఒక ప్రత్యేకమైన రోడ్డు మ్యాప్ రూపొందిస్తామని, దాని ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.

బుధవారం కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో రాజేందర్ రావును డంప్ యార్డ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న బాధితులు, ఆయా డివిషన్లకు చెందిన కాలనీ వాసులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా డంప్ యార్డ్ వల్ల ఐదు డివిజన్లకు సంబంధించిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజేందర్రావుకు వివరించారు.

డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తామని తెలిపారు. ఈ సమస్య్ పరిష్కారానికి అందరం కలిసి కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేద్దామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, సమస్య పరిష్కారానికి ఎలాంటి మార్గాలు అన్వేషించాలనే విషయంపై  అధ్యాయం చేస్తానని తెలిపారు. మధ్యప్రదేశ్లో సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరితోను కరీంనగర్లో అవగాహన సదస్సు నిర్వహించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.