16-07-2025 12:00:00 AM
కలెక్టర్ సంతోష్
గద్వాల, జూలై 15 ( విజయక్రాంతి ) : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఆదేశించారు. మంగళవారం ధరూర్ మండలంలోని ఉప్పేరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం-ఆ యుష్మాన్ ఆరోగ్య మందిర్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో ఆరోగ్య సిబ్బంది హాజరు రిజిస్టర్, ప్రసవాల రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీ లించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించి, గర్భిణుల నార్మల్ ప్రసవాలు నిర్వహించి, ,ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించారు.
ఫార్మసిస్టు మందుల నిల్వలను జా గ్రత్తగా పర్యవేక్షిస్తూ,ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. టీకాలు ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం సమయానికి వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి సిద్దప్ప, డాక్టర్లు రాజు,కృష్ణవేణి,వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.