05-10-2025 12:00:00 AM
తెలంగాణ రాష్ర్టంలో మొదటిసారి 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు వివాదాల మధ్యనే జరిగిన సం గతి తెలిసిందే. అయితే తాజాగా రెండో పర్యాయం జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వివాదాస్పదంగానే మా రుతున్నాయి. రెండుసార్లు వివాదాలకు కారణం బీసీ రిజర్వేషన్లే కావడం గమనా ర్హం. చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోయినా ప్రభుత్వం మాత్రం బీసీలకు జీవో నెంబర్ 9 ద్వారా 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ అక్టోబర్ 9 నుంచి స్థానిక ఎన్నికలకు సిద్ధపడటంతో కోర్టు కేసుల నేపథ్యంలో ఎన్నికలు జరుగుతా యా?
రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై రాష్ర్ట వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని 12,760 గ్రామపంచాయితీలకు, 5,763 ఎంపీటీసీలకు, 565 జెడ్పీటీ సీలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభు త్వం పట్టుదలగా ముందుకెళ్లాలని చూ స్తోంది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాకుండానే ప్రభుత్వం ఎలా ఎన్నికలను నిర్వహించగలుగుతుందనే సందే హాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ర్ట, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూ డా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశా న్ని తేల్చకపోవడం వల్ల ఎన్నికలు నిర్వహించలేకపోయాయనే విషయాన్ని గమనిం చాలి. తాజా పరిస్థితుల్లో రేవంత్ ప్రభుత్వానికి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహణ సందిగ్ధంలా మారింది.
అడ్డంకులు దేనికి?
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తూ తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం బిల్లును రూపొందించి శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించి రాష్ర్ట పతికి పంపారు. కానీ ఆ బిల్లుపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదని నిర్దేశిస్తున్న 285 (ఏ) సెక్షన్‌ను సవరణ చేస్తూ శాసనసభలో ఆమోదించిన సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లోనే ఉన్న నేపథ్యం లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు రాష్ర్ట ప్రభుత్వం జీవో నెంబర్ 9తో ప్రత్యేక జీవో ని విడుదల చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కానీ రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన జీవోలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటడంతో..
రెడ్డి జాగృతి సంస్థకు చెందిన బి.మాధవరెడ్డి అభ్యంతరాలను తెలుపు తూ తెలంగాణ రాష్ర్ట హైకోర్టులో పిటి షన్ వేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధ ర్మాసనం పూర్తిస్థాయి విచారణను అక్టోబ ర్ 8కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 9 నుంచి రెండు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను, మూడు దశల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించడం గమనార్హం.
ఆమోదం లభించేనా?
12 అంశాలతో ఉన్న జీవోలో 243 (డి) (టి) ప్రకారంగా రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ర్ట ప్రభుత్వానికి అధికారం ఉన్నదని ప్రస్తావించారు. కానీ 1994 చట్టం ప్రకారం గా రాష్ర్ట ప్రభుత్వానికి రిజర్వేషన్లు కల్పించడానికి అధికారం ఉన్నా నిబంధనలకు లోబడి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకే రిజర్వేషన్లు పెంచుతున్నామని జీవో లో ప్రస్తావించారు.
కానీ డెడికేటెడ్ కమిషన్‌ని ప్రస్తావించడమంటే 2010 సుప్రీం కోర్టు తీర్పు ప్రకారంగా రిజర్వేషన్ల కల్పనకి ట్రిపుల్ టెస్ట్‌ని అనుసరించామని చెప్పటమే. కానీ జీవోలో చట్ట ఉల్లంఘన, సు ప్రీంకోర్టు తీర్పులకు లోబడి లేకపోవడం, 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్ట సవరణ జరగకపోవడంతో జీవో ప్రకారంగా ఎన్నికలు జరపటానికి న్యాయ స్థా నాలు అంగీకరించకపోవచ్చు. రిజర్వేషన్ల కల్పనకు గాని, పెంపునకు గాని చట్టపరిధిలోని న్యాయస్థానాల తీర్పులకు లోబడి ఉండాలి.
అప్పుడే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోని కోర్టు లు తప్పు పట్టినా, స్టే ఇచ్చినా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. 2019 రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితిలే ఏర్పడతాయి. అవకాశాలు రాని కులాలకు, వర్గాలకు ఛాన్స్ ఇచ్చేందుకే రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి.
ఎస్సీ, ఎస్టీల కు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన వి ధంగానే వెనుకబడిన వర్గాలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని దశాబ్దాల డిమాండ్. కానీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ కార్యరూ పం దాల్చకుండానే మిగిలిపోయింది. 1994లో 243 ఆర్టికల్ ద్వారా స్థానిక సం స్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
నాటి నుంచి 2013 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి స్థా నిక సంస్థల ఎన్నికల నాటికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యాయి. కానీ 2010 సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తర్వాత తెలంగాణలో జరిగిన 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గిపోయాయి. చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపో వటం వల్ల రాష్ట్రంలో 56 శాతం ఉన్న జనాభా బీసీలే అయినప్పటికీ శాసనసభలో 21 మంది మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
నాలుగు శాతం ఉన్న ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వారు 43 మంది శాసనసభ్యులుగా ఉన్నారంటేనే రిజర్వేషన్ల ఆవశ్యకతను అర్థం చేసుకో వచ్చు. తెలంగాణ రాష్ర్టంలో 134 బీసీ కులాలు ఉంటే ఇప్పటివరకు 80 కులాలకి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్‌గా అవకాశమే దక్కలేదు. 56 శాతం ఉన్న బీసీలకి 42 శాతం రిజర్వేషన్లు దక్కటం సహజ న్యాయంగానే భావించాలి.
చట్టాలు ఎలా ఉన్నా సామాజిక న్యాయంపై గౌరవం ఉన్న వ్యక్తులు, వర్గాలు, బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడకుండా ఉంటే మంచిది. 69 సం వత్సరాలు తెలుగు నేలపై అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న వర్గాలు కనీసం బీసీలకు అధికారంలో సముచితమైన వాటా ఇవ్వటానికి అడ్డుపడకుండా ఉంటే అది సామాజిక ఐక్యతను మరింత బలపరుస్తుంది.
హైకోర్టు తీర్పుపై ఆసక్తి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతుంది. కోర్టుల తీర్పు, విచారణ అనేది చట్టాలకు, గత తీర్పులకు లోబడే ఉంటుందనే విషయాన్ని గమనించాలి. 1992 సుప్రీంకోర్టు తీర్పు, 1994 స్థానిక సంస్థల రిజర్వేషన్ల మార్గదర్శకాలు, నిబంధనలు, 2010 సుప్రీంకోర్టు ఇచ్చిన ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలనే సూచనలు, 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో కల్పించిన రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లను పరిగణలోకి తీసుకుంటారు.
కాబట్టి తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం జీవో.9లో ప్రతిపాదించిన రిజర్వేషన్ల ప్రకారంగా ఎన్నికలు నిర్వహించడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు బలహీనంగా ఉండటం, 285 (ఏ) సెక్షన్‌కు సవ రణ జరగకపోవడం కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వానికి రిజర్వేషన్ల సాధనలో ప్రతిబంధకంగా మారవచ్చు.
తమిళనాడు అనుభవాలు పరిగణలోకి తీసుకున్నా పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల సమన్వయంతో చట్ట రూ పంలో రిజర్వేషన్లు సాధించాల్సి ఉం టుంది. 42 శాతం రిజర్వేషన్లు సాధించగలిగితే వార్డు పదవులతో పాటు 55, 280 స్థానిక సంస్థల పదవులు బీసీలకు దక్కుతాయి. ఒకవేళ రిజర్వేషన్లకు అవరోధాలు ఎదురైతే 73 శాతంతో 96,083 స్థానాల్లో పోటీ చేసి బలహీనవర్గాలు రాజకీయంగా తమ సత్తా ఏమిటో పార్టీలకు, ప్రభుత్వాల కు చూపించాల్సిన అవసరముందని బీసీ వర్గాలు భావిస్తున్నాయి.
వ్యాసకర్త సెల్: 9885465877