calender_icon.png 8 October, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షట్‌డౌన్ వెనుక కారణాలెన్నో!

05-10-2025 12:00:00 AM

ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న షట్‌డౌన్ గొడవ కేవలం డబ్బు లెక్కల గురించి కాదు. ఇది తమ పార్టీకి నచ్చిన విధానాలను అమలు చేయించుకోవడానికి లేదా ప్రత్యర్థి పార్టీ విధానాలను రద్దు చేయించడానికి రాజకీయ నాయకులు చేస్తున్న పోరాటం. 

అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన దేశంగా పేరు పొందిన అమెరికాలో ఒక వింత రాజకీయ సమస్య ఏర్పడింది. అదే ప్రభుత్వ షట్‌డౌన్. ఇది మన ఉద్యోగులు సమ్మె చేసినట్లుగా ఉండే సాధారణ సమ్మె ఎంత మాత్రం కాదు. రాజకీయ నాయకులు బడ్జెట్ విషయంలో రాజీ పడకపోతే, దేశ కార్యకలాపాలే ఆగిపోయేలా తీవ్ర సంక్షోభాన్ని తీసుకొచ్చేలా ఉంటుంది.

గత కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో ఈ సమస్య తరచుగా వస్తూనే ఉం ది. ఒక చిన్న లోపం కాస్తా దేశాన్ని స్తంభింపజేసే రాజకీయ ఆయుధంగా మారిపో తుంది. అమెరికా ఆర్థిక శక్తి ప్రపంచాన్ని శాసించేంతలా ఉంటుంది. అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నప్పటికీ ఒక చిన్న డబ్బు గొడవ వల్ల తనకు తానే తాళం వేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి షట్‌డౌన్ వెనుక ఉన్న కథ, దానివల్ల కలిగే నష్టాలు కూడా చాలా లోతైనవే.

షట్‌డౌన్ అనేది అధ్యక్షుడు ఇష్టపూర్వకంగా తీసుకునే నిర్ణయం కాదు. అమెరికాలో ప్రభు త్వం ఖర్చు పెట్టాలంటే, కాంగ్రెస్ (పార్లమెంటు) తప్పనిసరిగా చట్టబద్ధంగా అను మతి ఇవ్వాలి. ఈ నియమం ‘యాంటీ డిఫిషియన్సీ’ చట్టం అనే పాత చట్టంలోనే ఉంది. ఈ చట్టం ఏం చెబుతుందంటే.. కాంగ్రెస్ నాయకులు నిర్ణీత గడువులోగా నిధుల బిల్లులను పాస్ చేయడంలో విఫలమైతే, డబ్బు ఖర్చు పెట్టడానికి అనుమతి ఉండదు.

దాంతో అత్యవసరం కాని ప్రభు త్వ కార్యాలయాలు, విభాగాలు తమ పనులను తప్పనిసరిగా ఆపేయాలి. అందుకే ఈ సమస్యకు పూర్తి బాధ్యత, పరిష్కారం కూడా కాంగ్రెస్ చేతుల్లోనే ఉంటాయి. షట్‌డౌన్ జరిగినప్పటికీ అన్ని కార్యకలాపాలు మాత్రం ఆగవు. ప్రాణాలు, ఆస్తులను కా పాడే పనులు మాత్రం యధావిథిగా కొనసాగుతాయి. సైన్యం, సరిహద్దు భద్రత, ఎ యిర్ ట్రాఫిక్ కంట్రోల్, సామాజిక భద్రత (పెన్షన్లు) వంటి ముఖ్యమైన సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి.

అయితే షట్‌డౌన్ వల్ల ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగులు జీతం ఎప్పుడు వస్తుందో తెలియకుండానే పనిచేయాల్సి ఉంటుంది. మరోవైపు, ఫెడరల్ పార్కులు, మ్యూజియంలు, కొన్ని సైన్స్ పరిశోధన సంస్థలు, చిన్న వ్యాపారాలకు ఇచ్చే లోన్ ఆమోదా లు, లైసెన్సులు వంటివి ఆగిపోతాయి. 

ఎందుకీ గొడవ?

ఇప్పుడు జరుగుతున్న షట్‌డౌన్ గొడవ కేవలం డబ్బు లెక్కల గురించి కాదు. ఇది తమ పార్టీకి నచ్చిన విధానాలను అమలు చేయించుకోవడానికి లేదా ప్రత్యర్థి పార్టీ విధానాలను రద్దు చేయించడానికి రాజకీయ నాయకులు చేస్తున్న పోరాటం. అమె రికాలో త్వరలో గడువు తీరిపోనున్న ఆరో గ్య ప్రయోజనాలను పొడిగించాలని విపక్ష డెమొక్రాట్లు కోరగా, రిపబ్లికన్లు తిరస్కరించారు.

అలా చేస్తే ఖజానాపై భారం పడు తుందని వారి వాదన. దీంతో డెమొక్రాట్లు బిల్లుపై సుముఖత చూప లేదు. అ మెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో ట్రంప్ పార్టీకి మె జారిటీ ఉన్నప్పటికీ సెనేట్‌లో తగిన మె జార్టీ లేకపోవడంతో స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్లు నెగ్గలేదు. కీలకమైన స్టాప్ గ్యాప్ ఫం డింగ్ బిల్లుకు సెనేట్‌లో ఆమోదం లభిం చలేదు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి షట్‌డౌన్ అమలులోకి రావడంతో అత్యవసరం కాని ప్రభుత్వ సేవలు, కార్యకలాపాలు నిలిచిపోయాయి.

1981 తర్వాత ఇది 15వ షట్‌డౌన్ కాగా, గత ఏడేండ్లలో ఇది రెండోసారి. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు 2018లో షట్‌డౌన్ ప్రకటిం చారు. అది 35 రోజుల పాటు కొనసాగిం ది. అమెరికా చరిత్రలో అదే ఎక్కువకాలం కొనసాగిన షట్‌డౌన్. దీనిని ఒక రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు. బడ్జెట్ ఆ మోదాన్ని అడ్డుకోవడం ద్వారా, తమ రాజకీయ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ప్ర భుత్వాన్ని స్తంభింపజేసే శక్తిని చిన్న రాజకీ య బృందాలు కూడా పొందుతున్నాయి. ఉదాహరణకు గతంలో ఆరోగ్య పథకం (ఏసీఏ) రద్దు లే దా సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు వంటి డిమాండ్లపై ష ట్‌డౌన్‌లు జరిగాయి.

షట్‌డౌన్ వల్ల వచ్చే నష్టం చాలా పెద్దది. లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు వెంటనే జీతం కోల్పో తారు. దీంతో వారు ఇంటి అద్దెలు, ఈఎంఐలు చెల్లించలేక.. కుటుంబ ఖర్చులు భ రించలేక కష్టాల పాలవ్వడం సహజం. కాం ట్రాక్టు ఉద్యోగులకు పోయిన జీతం తిరిగి రాదు.

ఇది వా రి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్ర భావం తీవ్రంగా ఉంటుంది. పెద్ద షట్‌డౌన్‌లు దేశ స్థూల దేశీయోత్పత్తిలో బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టాన్ని కలిగిస్తాయి. పౌరుల కు ప్రభుత్వంపై నమ్మకం తగ్గడం, ఉద్యోగు ల మనో ధైర్యం దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక నష్టాలను లెక్కించడం కూడా కష్టం. 

ప్రపంచ దేశాలపై ప్రభావం?

షట్‌డౌన్ ప్రభావం ఒక్క అమెరికాకే పరిమితం కాదు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ పెట్టుబడిదారుల నమ్మకాన్ని ఇది తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వం టి కీలకమైన ఆర్థిక సమాచారాన్ని సేకరించే సంస్థలు ఆగిపోవడం వల్ల, ప్రపం చంలోని పెద్ద బ్యాంకులు (ఫెడరల్ రిజర్వ్ లాంటివి) సరైన నిర్ణయాలు తీసుకోలేవు. అంతేకాకుండా, విదేశాలకు ఇచ్చే సహాయాలు, వీసాలు వంటి సేవలు ఆగిపో వడం వల్ల, అమెరికా ఒక నమ్మదగిన భాగస్వామి కాదనే భావన ప్రపంచ దేశాల్లో పెరుగుతుంది. అమెరికాలో ఉన్నట్లుగా, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మూతపడే పరిస్థితి రాదు.

మన రాజ్యాంగంలో దీనికి ఒక తెలివైన పరిష్కారం ఉంది. అదే ఓట్ ఆన్ అకౌంట్. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 116 ప్రకారం.. పూర్తి బడ్జెట్ ఆమో దం ఆలస్యమయినా సరే తాత్కాలికంగా కొన్ని నెలలకు అవసరమైన డబ్బును ఖ ర్చు పెట్టడానికి పార్లమెంట్ అనుమతిస్తుంది. ఈ విధానం వల్ల జీతాలు, ముఖ్య మైన పథకాల ఖర్చులు ఆగకుండా, ప్రభు త్వ పని నిరంతరాయంగా కొనసాగుతుం ది.

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ అనేది పా ర్టీల గొడవల వల్ల దేశానికి, ప్రజలకు, ప్రపంచానికి కలిగే నష్టం. రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, దేశ స్థిరత్వాన్ని ముఖ్యంగా భావించాలి. భారతదేశంలోని ‘ఓట్ ఆన్ అకౌంట్’ లాంటి విధానాలు, బడ్జెట్‌ను ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఆమోదించడం వంటి శాశ్వత మార్పులు చేస్తేనే, అమెరికా ఈ సంక్షోభం నుంచి బయటపడుతుంది. లేదంటే ‘ఖజానా అస్త్రం’ భవిష్యత్తులోనూ అమెరికాను వెంటాడుతూనే ఉంటుంది.

      వ్యాసకర్త సెల్: 9494588909