21-09-2025 01:02:31 AM
-హెచ్ వీసా దరఖాస్తు రుసుము పెంపు.. ఆ దేశానికే నష్టం
-భారత్‌కు మాత్రం టర్బోచార్జ్.. దేశీయంగా స్టార్టప్‌లు పెరుగుతాయ్
-అగ్రరాజ్యం తన ద్వారాలను తానే మూసుకున్నది..
-నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వీసాల దర ఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ దేశమే ఉక్కిరి బిక్కిరి అవుతుందని, ఆ నిర్ణయం భారత్‌కు మాత్రం టర్బోచార్జ్ అవుతుందని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాం త్ పేర్కొన్నారు. శనివారం ఆయన ‘ఎక్స్’ వే దికగా స్పందిస్తూ.. ట్రంప్ దూకుడు నిర్ణయంతో ఆ దేశమే భారీగా నష్టపోతుందని, తాజా నిర్ణయంతో తన ద్వారాలు తనే మూసుకున్నట్లయిందని వెల్లడించారు.
ఆ నిర్ణయం భారత్‌కు మాత్రం పరోక్షంగా లాభపడుతుందని అభిప్రాయపడ్డారు. భారత్‌కు చెందిన ప్రపంచస్థాయి ప్రతిభావంతులకు అమెరికా ద్వారాలు తెరవకపోతే, భారత్‌లోని బెంగళూరు, హైదరాబాద్, పుణె, గురు గ్రాంకు ల్యాబ్‌లు, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యుత్తమ వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ‘వికసిత భారత్’ కలను సాకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రగతికి మరిన్ని ముందడుగులు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. భార త్ ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రం కా బోతుందని జోస్యం చెప్పారు.