21-09-2025 01:01:21 AM
-లేకపోతే తిరిగి ప్రవేశానికి ఇబ్బందులు ఎదురవ్వచ్చు..
-దేశంలోనే ఉన్న వారు అమెరికాను వీడొద్దు..
-తమ ఉద్యోగులకు మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సంస్థల అత్యవసర మెయిల్స్
వాషింగ్టన్, సెప్టెంబర్ 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ వీ సాల దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ టెక్ సంస్థలు తమ హెచ్ వీసా ఉద్యోగులకు ఈఫైమెయిల్ ద్వారా అత్యవసర ఆదేశాలు జారీ చేశాయి. 14 రోజుల పాటు అమెరికా వీడి వెళ్లవద్దని సూచించాయి. అలాగే దేశం వెలుపల ఉన్న తమ కంపెనీల ఉద్యోగులు 24 గంటల్లోపు తిరిగి అమెరికా చేరుకోవాలని ఆదేశాలిచ్చా యి.
లేనిపక్షంలో తిరిగి అమెరికాలోకి ప్రవేశానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, కొత్త నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించాయి. హెచ్ వీసాను అమెరికా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, టెక్ ప్రోగ్రామ్ మేనేజర్లకు జారీ చేస్తుంది. ఈ వీసా మూడేళ్ల పాటు చెల్లుబా టు అవుతుంది. ఉద్యోగులు ఆ తర్వాత మ రో మూడేళ్లకు వీసాను రెన్యువల్ చేసుకోవచ్చు. కొత్తగా ప్రకటించిన గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్ ద్వారా అమెరికా గోల్డ్ కార్డ్, ట్రం ప్ ప్లాటినం కార్డ్, ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్‌ను ప్రవేశపెట్టింది.
వీటి ద్వారా టెకీలు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు సులభంగా అమెరికా పౌరసత్వం పొందే మార్గాలను సుగ మం చేస్తాయి. గతేడాది హెచ్ వీసా తీసుకున్న వారిలో అత్యధికంగా భారతీయు లు 71శాతం మంది ఉండగా, చైనీయులు 11.7శాతం మంది ఉన్నారు. అమెరికాకు చెం దిన టెక్ కంపెనీలన్నీ నైపుణ్యం కలిగిన ఉ ద్యోగుల కోసం ఎక్కువగా భారతదేశం, చైనా పై ఆధారపడతాయి. అయితే, కొత్తగా పెం చిన వీసా ఫీజు వల్ల కంపెనీల ఖర్చు భారీగా పెరిగిపోతుంది. అమెరికా నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరుతూ పలు టెక్ సంస్థలు కో ర్టును ఆశ్రయించే అవకాశం ఉందని కొం దరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.