calender_icon.png 21 September, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా నిర్ణయం ఆమోదయోగ్యం కాదు

21-09-2025 01:04:10 AM

-హెచ్‌ఔ వీసా ఫీజు పెంపు షాక్‌కు గురి చేసింది

-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 20: అగ్రరాజ్యం అమెరికా హెచ్ వీసా ఫీజులను విపరీతంగా పెంచడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘వీసా ఫీజులు పెంచాలనే అమెరికా అధినేత ట్రంప్ నిర్ణయం అందర్నీ షాక్‌కు గురి చేసింది. భారత్ అమెరికా సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉంది. ఈ నిర్ణయం ఆమోదయోగ్యం కాదు. అమెరికాలో ఉద్యోగం చేసే ప్రతిభ గల భారతీయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం వెంటనే సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. అందుకోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. తెలుగు టెకీల బాధలు వర్ణించలేనివి. ఈ సమస్యను యుద్ధప్రాతిపదికన వెంటనే పరిష్కరించాలని ప్రధాని, విదేశాంగమంత్రిని కోరుతున్నా’ అని పోస్ట్ చేశారు.